Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్‌ను ఉన్నతన్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత చూపింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా... బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారతి, ఇతరులు దాఖలు చేసిన పిటషన్‌పై న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమనాథ్ విచారణ చేపట్టారు.