Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంగుళూరు: దక్షిణ కర్నాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బ్లాస్ట్ కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కర్నాటక అదనపు డీజీపీ అలోక్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆటోరిక్షాలో వెళ్తున్న ఓ ప్రయాణికుడు కుక్కర్ బాంబును తీసుకువెళ్లాడని, అది పేలడం వల్ల ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలైనట్లు ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్‌ను పురుషోత్తం పూజారిగా, ప్రయాణికుడిని షారిక్‌గా గుర్తించామన్నారు. నిందితుడు షారిక్‌పై మూడు కేసులు ఉన్నాయని, రెండు మంగుళూరు సిటీలో, ఒకటి శివమొగ్గలో నమోదు అయినట్లు తెలిపారు. యూఏపీఏ చట్టం కింద అతన్ని బుక్ చేశారు. నిందితుడికి చెందిన ప్రదేశాలను చెక్ చేశామని, అక్కడ నుంచి చాలా వరకు పేలుడు పదార్ధాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కొన్నింటిని ఆన్‌లైన్‌లో, కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్నట్లు గుర్తించామన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో షారిక్ పనిచేశాడని, ఆ సంస్థకు చెందిన అల్ హింద్ అనే గ్రూపుతో షారిక్‌కు లింకులు ఉన్నట్లు తేల్చారు. అరాఫత్ అలీ అనే వ్యక్తితో షారిక్‌కు సంబంధాలు ఉన్నాయన్నారు. అల్ హింద్ మాడ్యూల్ కేసులో ఆ ఇద్దరూ నిందితులే. షారిక్‌తో లింకున్న వారిని గుర్తిస్తున్నామని పోలీసులు చెప్పారు.