Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూప్రాన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి బాలుర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంఫియన్‌షిప్ పోటీల్లో మెదక్ జిల్లా బాలుర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం నిర్వహించిన ముగింపు పోటీల్లో క్రీడాకారులు కప్పును అందుకున్నారు. సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంఫియన్‌షిప్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ప్రతిభ చూపించింది. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నిజామాబాద్‌తో జరిగిన మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి 10-3తో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఛాంపియన్‌షిప్ బెస్ట్ ప్లేయర్‌గా జిల్లాకు చెందిన మహిపాల్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శోభన్‌బాబు, కోశాధికారి అభిషేక్‌గౌడ్, మెదక్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. జట్టు శిక్షకులు శానవాజ్, లింగం, శోభన్‌నాయక్‌ను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణగుప్తా, ప్రధానకార్యదర్శి శ్యాంసుందర్‌శర్మ అభినందించారు.