Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌడిపల్లి: దైవదర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అతివేగంగా వస్తున్న కారు, ట్రాక్టర్‌ను పక్కనుంచి బలంగా ఢీ కొనడంతో ట్రాక్టర్‌లో ఉన్న 20 మందికి గాయాలైన సంఘటన మండలంలోని అంతారం గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామానికి చెందిన ముత్యంగారి జయమ్మ, వెంకటమ్మ, వసంత, భారతమ్మతో పాటు 20 మంది వరకు తునకి నల్లపోచమ్మ ఆలయం వద్దకు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ట్రాక్టర్‌లో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అంతారం గేట్ సమీపంలోకి రాగానే అతివేగంగా వస్తున్న కారు పక్కనుంచి ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొనడంతో ట్రాక్టర్ రెండు చక్రాలు ఊడిపోయాయి. దీంతో అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్న ట్రాక్టర్‌లోని సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కొల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతో్‌షకుమార్‌తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వారిని మెదక్ ఏరియా అసుపత్రికి తరలించారు. కాగా కారులో ఏయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు.