Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెన్‌ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలోని కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్ హైటెక్ జోన్ లో మంటలు చెలరేగాయి.ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 200 మంది సహాయకులు, 60 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి.