Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల కింద యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక- యాజమాన్య కమిటీ సమావేశం మంగళవారం జలసౌధలో జరగనుంది. ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదులతోపాటు ఉప నదులు, వాగులకు భారీ వరదలు వచ్చాయి. దీంతో జలాశయాలు, మధ్య, చిన్నతరహా వనరులు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పలు ప్రాజెక్టుల కింద ఇప్పటికే సాగు ప్రారంభమైంది. ఎంజీకేఎల్‌ఐ, భీమా, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, కోయిల్‌సాగర్ పథకాల పరిధిలో ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.