Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు.