Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: రోహిత్ రాయుడు (109) శతకంతో రాణించడంతో.. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్ కథన్ పటేల్ (109) సెంచరీతో జట్టును ఆదుకొన్నాడు. సంకేత్ 3 వికెట్లు పడగొట్టగా.. తనయ్ త్యాగరాజన్, అంకిత్ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49 ఓవర్లలో 251/6 స్కోరు చేసి నెగ్గింది. తిలక్ వర్మ (65) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చింతన్ గాజా, కథన్ పటేల్ చెరో రెండు వికెట్లు సొంతం చేసుకొన్నారు. గ్రూప్-సిలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 3 వికెట్ల తేడాతో హరియాణాపై నెగ్గింది. రికీ భుయ్ (112 నాటౌట్) శతకం సాధించాడు.