Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సోలమన్ దీవుల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతత ప్రకంపనలు వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ ప్రకంపనల నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. సోలమన్ ఐస్‌లాండ్ రాజధాని హోనియారాకు నైరుతి దిశలో 56 కిలోమీటర్లు దూరంలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
అయితే సునామీ ముప్పు ఉండదని పేర్కొంది. సోలమన్ దీవుల్లో మూడు అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాపువా న్యూ గినీ, వనౌటు తీరాల్లో అలలు ఎగిసిపడొచ్చని పేర్కొంది. సోలమన్ దీవులు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ అనేక అగ్నిపర్వతాల విష్ఫోటనాలు, భూకంపాలు తరుచూ వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. సోమవారం ఇండోనేషియా జావా ద్వీపంలో రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి భారీగా భవనాలు నేలకలగా.. మరికొన్ని పగులుబారాయి. భూకంపలతో ఇప్పటి వరకు 162 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలకు గురయ్యారు.