WATCH: French President Emmanuel Macron Slapped Again In Public By Protester pic.twitter.com/HU0S8Jdthn
— Sahara Reporters (@SaharaReporters) November 21, 2022
Authorization
WATCH: French President Emmanuel Macron Slapped Again In Public By Protester pic.twitter.com/HU0S8Jdthn
— Sahara Reporters (@SaharaReporters) November 21, 2022
హైదరాబాద్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన నడుస్తూ వెళ్తుండగా ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరించిన మహిళ చెంప ఛెళ్లుమనిపించింది. ఆ సమయంలో కొందరు మీడియా వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మాక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను పక్కకు లాగేశారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫ్రాన్స్ లోని డ్రోమ్ రీజియన్ లోని టైన్ హెర్మిటేజ్ టౌన్ లో ఫుడ్, రెస్టారెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను మరింత సరళతరం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంత మంది వద్దకు మాక్రాన్ వెళ్లారు. ఇంతలో ఊహించని విధంగా మాక్రాన్ చెంపను అక్కడున్న ఒక మహిళ ఛెళ్లుమనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తితో మాట్లాడేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా మాక్రాన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.