Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54.67 పాయింట్ల లాభంతో 61,199 పాయింట్ల వద్ద, నిఫ్టీ కూడా 17.85 పాయింట్ల స్వల్ప లాభంతో 18,177.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి, 61,278 వద్ద, నిఫ్టీ 38.9 పెరిగి, 18,198 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, నెస్లే, బీపీసీఎల్, కొటక్ మహింద్రా బ్యాంకులు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్ లాభాల్లో ఉండగా.. హాంగ్‌సెంగ్ నష్టాల్లో ఉన్నాయి.
మరో వైపు ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. రూపాయి 12 పైసలు పెరిగి 181.72 వద్ద ట్రేడవుతున్నది. ఇదిలా ఉండగా గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధర 82 డాలర్లకు చేరింది. సోమవారం యూఎస్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.13 శాతం, ఎస్‌అండ్‌పీ 0.39 శాతం, నాస్‌డాక్ 1.09 శాతం నష్టపోయాయి.