Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో చొరబాటుదారుడిని హతమార్చడంతో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు సరిహద్దు భద్రతా దళం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్, సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో చొరబాటుదారుల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి తెలిపారు. అర్నియా సెక్టార్‌లో సరిహద్దు కంచె వైపు పాక్ చొరబాటుదారుడు దూసుకురాగా.. హెచ్చరికగా బీఎస్‌ఎఫ్ కాల్పులు జరిపిందని, అయినా పట్టించుకోకపోవడంతో కాల్చి వేసినట్లు పేర్కొన్నారు. రామ్‌గఢ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు దాటిన పాక్ చొరబాటుదారుడిని సైనికులు అరెస్టు చేశారని ప్రతినిధి వివరించారు. రెండు సెక్టార్లలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా శోధిస్తున్నట్లు వివరించారు.