Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబియా: కొలంబియా దేశంలోని ఓ నగరంలో ఓ చిన్న విమానం కుప్పకూలి పోయింది. కొలంబియాలోని రెండవ అతిపెద్ద నగరం మెడెలిన్‌లోని నివాస ప్రాంతంలో ఒక చిన్న విమానం కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు, మేయర్ తెలిపారు.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరి ఇంజిన్ వైఫల్యంతో ఇంటిపై కుప్పకూలి పోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.