Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అలెన్ ఎల్బీగా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్క్ చాప్‌మన్ తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా భారత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో పేస్ బౌలర్ హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇక మరోసారి భారత బ్యాటర్ సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.