Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం పాల్గొంటారు. ఈ యాత్ర బుధవారం మధ్య ప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. ఈ యాత్రలో ఆమె పాల్గొంటుండటం ఇదే మొదటిసారి. భారత్ జోడో యాత్ర నిర్వహణ బాధ్యతలను చూస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత్ జోడో యాత్ర బుధవారం బుర్హాన్‌పూర్ వద్ద మధ్య ప్రదేశ్‌లో ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా మధ్య ప్రదేశ్‌లో ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. ఆమె నాలుగు రోజులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలలో పూర్తయింది.