Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్ విసిరిన 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 60 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు ఔటయ్యారు. న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. ఏడు ఓవర్లలో ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 64 రన్స్ చేసింది. పాండ్యా 25, దీపక్ 3 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 160 రన్స్‌కు ఆలౌటైంది. కాన్వే, ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించారు. కాన్వే 59, ఫిలిప్స్ 54 రన్స్ చేశారు. నిజానికి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కివీస్‌ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. మూడవ వికెట్‌కు కాన్వే, ఫిలిప్స్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ మూడో వికెట్‌కు 86 రన్స్ జోడించారు.