Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు అన్నారు. సికింద్రాబాద్ లోని మెహబూబ్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ.. స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింపోరియంకు ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పలు పార్టీల నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చెలాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందిస్తోందని కేకే విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆయన.. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. కేంద్ర నిరంకుశ వైఖరిని ప్రజలందరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.