Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం సుమారు 300 మంది ఉగ్రవాదులు ఉన్నారని, మరో 160 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ ఎల్ఓసీ వెంబడి పొంచి ఉండి భారత్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు చూస్తున్నారని నార్తన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్.. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అయితే, 2019 ఆగస్టులో కశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకూ నియంత్రించామని చెప్పారు.
సుమారు 300 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నారు. అయితే వారిని ఎలాంటి బరితెంగింపు చర్యలకు పాల్పడనీయం అని మంగళవారంనాడిక్కడ జరిగిన చారిత్రక 'పూంచ్ లింగ్-అప్ డే' ప్లాటినం జూబ్లీకి హాజరైన సందర్భంగా ద్వివేది చెప్పారు. పాకిస్థాన్ దురాక్రమణదారుల నుంచి సరిహద్దు జిల్లాను కాపాడేందుకు 1948లో భారత ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ ఈజీ' స్మారకార్థం పూంచ్ లింక్-అప్ డే ప్లాటినం జూబ్లీ ఇక్కడ నిర్వహిస్తున్నారు.