Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ దవాఖానాకు తరలించారు. అయితే రుద్రారం ఏరియాల్లో జింకలు నివసించడం లేదని అధికారులు తెలిపారు. ఆ మచ్చల జింక వికారాబాద్ అడవుల్లో నుంచి ఇటు వైపు వచ్చి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు.