Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆచార్య సూర్యాధనంజయ్, రమేశ్ కార్తీక్ నాయక్ సంపాదకులుగా, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 'కేసులా' కథల సంకలన ఆవిష్కరణ, మినిస్టర్ క్వార్టర్స్ లో ఘనంగా జరిగింది.
ఈ పుస్తకం గురించి మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలని, ఆ దిశగా ఆచార్య సూర్యా ధనంజయ్, రమేశ్ కార్తీక్ నాయక్ లు పనిచేయాలని కోరారు. సంపాదకులుగా ఇంత మంచి గ్రంథాన్ని తీసుకొచ్చినందుకు వారినిద్దరిని అభినందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ గారిని ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు ప్రచురించి ఇప్పటి తరానికి అందించాలని అభిలాషించారు. 'కేసులా' అంటే మోదుగుపూలని, అవి తమ రంగుని కోల్పోవని, చెట్టు మీదున్నా, రాలిపోయినా వాటిలో కాంతి ఏమాత్రం తరగక నిలిచే ఉంటుందని అటువంటి మోదుగపువ్వుల లాంటి వారే ఈ గిరిజనులైన బంజారాలన్నారు. బంజారా కథా ప్రపంచంలోకి ఈ పుస్తకం రావడం తమకెంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, సంపాదకులు ఆచార్య సూర్యాధనంజయ్, రమేశ్ కార్తీక్ నాయక్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సందీప్ కుమార్ సుల్తానీయా ఐ.ఎ.ఎస్, డా.యం.ధనంజయ్ నాయక్, డా.రమావత్ శ్రీనివాస్ నాయక్, డా.ఎస్ రఘు తదితరులు పాల్గొన్నారు.