Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) రెండు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) అవార్డులను తాజాగా దక్కించుకుంది. ఐసీసీ టెక్నాలజీ అడాప్షన్ కేటగిరి-డిలో మొదటి ర్యాంకు, పెర్ఫామెన్స్ ఇంప్రూవ్ మెంట్- కేటగిరి ఈ లో మూడో ర్యాంకు సాధించింది. ఈ అవార్డులను ఈ నెల 17, 18న ఢిల్లీలో జరిగిన 16వ ‘‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కమ్స్- 2022’’ కార్యక్ర మంలో సంస్థ ప్రాజెక్టుల డైరెక్టర్ టి. శ్రీనివాస్ అందుకున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం టీఎస్‌ఎస్పీడీసీఎల్ వివిధ ఐటీ, మొబైల్ యాప్ ఆధారిత సేవలను అభివృద్ధి చేసింది. వీటితో వినియోగదారులు విద్యుత్ అంతరాయాల సమస్యల ఫిర్యాదు, బిల్లింగ్ వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, నూతన సర్వీసుల మంజూరు, వాటి పర్యవేక్షణ వంటి సేవలను వినియోగదారులు సులువుగా పొందుతున్నారని శ్రీనివాస్ తెలిపారు. సంస్థ అందుకున్న అవార్డులను సీఎండీ జి.రఘుమారెడ్డికి ఆయన మంగళవారం అందజేశారు.