Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ ఉపరితలం కింది టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువన 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు చెప్పారు.