Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్ ప్రాంతానికి చెందిన యువకుడు.. తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మృతిచెందిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి ఉండగా, మరొ రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు డగ్స్‌కు బానిసగా మారాడని చెప్పారు. అయితే హత్యలకు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.