Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్‌కు చెందిన హేమలత(19) ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన వరుణ్‌తో రెండు నెలల క్రితం ఫోన్‌లో పరిచయం కాగా, రోజూ వాట్సా్‌పలో చాటింగ్ చేసుకుంటున్నారు. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో పది రోజుల క్రితం ఇద్దరి తరఫు వారు మాట్లాడుకుని పెళ్లికి నిర్ణయం తీసుకున్నారు. అయితే వరుణ్ పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దాంతో మనస్తాపం చెందిన హేమలత సోమవారం 12.30 గంటల సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.