Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతిలో నొప్పిరావడంతో వెంటనే ఆయనను ఐటీ అధికారులు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుమారుడిని చూసేందుకు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఐటీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఐటీ అధికారులు నా కొడుకును కొట్టినట్టున్నారు. నా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో నా కొడుకును చూడనివ్వడం లేదు. మహేందర్ రెడ్డి ని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారు. మేము ఎవరిని దగా మోసం చేయడం లేదు. మేం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. స్మగ్లింగో, క్యాసినోనో ఆడటం లేదు. బీజేపీ దుర్మార్గ పాలన చేస్తోంది’’ అంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.