Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట టీకాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలందిరినీ ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐదుగురు.. అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ ఆలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గాలి అనిల్ కుమార్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు నలుగురు నేతలను అధికారులు విచారించి, వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. తాజాగా బుధవారం అంజన్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విరాళాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణలో నలుగురు నేతలు విరాళాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. పార్టీ ఎవరికి ఇవ్వమని చెప్పింది? ఎందుకిచ్చారన్న కోణంలో వారిని అధికారులు విచారించారు. ఇవాళ అంజన్‌కుమార్ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు.