Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ గురుకుల ప్రిన్సిపాల్‌పై బూతులు తిట్టుకుంటూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి దాడి చేశారు. ఈ సంఘటన నిన్న జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన గురుకుల ప్రిన్సిపాల్ కాలర్ పట్టుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన తీరుపై ఆకునూరి మురళి స్పందించారు. గద్వాల్ ప్రాంతంలో గత 40 సం|| నుండి ఈ రెడ్డి దొరల అఘాయిత్యాలు దారుణమంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. చట్టం తనపని తను చేస్తుందా? ఆన్ డ్యూటీ అధికారి మీద దౌర్జన్యం కాల్చేయండి అంటూ డిజీపీని కోరారు.