Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మేనల్లుడు యూపీ రాజధాని లక్నోలోని తన నివాసంలో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. కేంద్ర మంత్రి మేనల్లుడు బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి కౌశల్ కిషోర్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర క్యాబినెట్‌లో ప్రస్తుతం హౌసింగ్, పట్టణవ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్యోదంతంపై కిషోర్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న బాలికలు, యువతులు సహజీవనం చేయరాదని ఆయన వ్యాఖ్యానించారు.