Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డిసెంబర్ 5వ తేదీన ప్రధాని మోడీ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు. తదుపరి జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షుల సమావేశంలో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర తెలుసుకోనుంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది.