Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూపీ రాజధాని లక్నోలోని దుబగ్గలోని బిగారియా ప్రాంతంలో తన నివాసంలో బుధవారం కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మేనల్లుడు నంద్ కిషోర్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కౌశల్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. కేంద్ర మంత్రి మేనల్లుడు నందకిషోర్ ప్రాపర్టీ డీలర్ గా పని చేస్తున్నాడు. కౌశల్ కిషోర్ పార్లమెంటులో మోహన్ లాల్ గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈయన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్యోదంతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మరిన్ని విషయాలు తెలువాల్సి ఉంది.