Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ గోవా: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేషన్ చేయకుండానే వాడుకుంటున్నట్లు యువీపై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబర్ 8వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. యువీ కాసా సింగ్ విల్లాను గోవాలో హోమ్‌స్టేగా వాడుకుంటున్నాడు. కానీ, దానిని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో పర్యాటక శాఖ డిసెంబర్ 8వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని యువీకి నవంబర్ 18న నోటీసులు జారీ చేసింది.