Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు తిరిగి విచారణ చేపట్టింది. ఈ తరుణంలో ఎసీట్ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సిట్ విచారణకు బిఎల్ సంతోష్ గైర్హాజరు పై హైకోర్టు విచారణ చేపట్టింది. బిఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యాలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు ఏజి. ఈనెల 20వ తేదీననే నోటీసులు అందినప్పటికీ బియ్యం సంతోష్ హాజరు కాలేదని న్యాయస్థానానికి తెలిపారు ఏజీ. ఆయన వాదనతో ఏకీభవించిన హై కోర్ట్ సంతోష్ విచారణకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత పిటిషనర్ పై ఉందని తెలిపింది. బిఎల్ సంతోష్ కి ఈమెయిల్ ద్వారా 41ఏ సిఆర్పిసి నోటీసులు మళ్లీ ఇవ్వాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం ఈ కేసు పై విచారించిన కోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందని కారణంగా మధ్యాహ్నానికి వాయిదావేసింది.