Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నవజాత శిశువును ఎవరో పొలాల్లో పడేశారు. అయితే రాత్రంతా చల్లని, కఠినమైన శీతాకా వాతావరణాన్ని ఆ పసి పాప తట్టుకుంది. ఉదయం గ్రామ సర్పంచ్ కంటపటడంతో ఆ శిశువును వెంటనే ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిహాల్‌పూర్ గ్రామ సర్పంచ్ రాజ్‌కుమార్ యాదవ్, బుధవారం ఉదయం కాలినడకన తన పొలానికి వెళ్లాడు. అయితే అక్కడ నవజాత శిశువు పడి ఉండటం చూసి షాకయ్యాడు. పసి పాపను వెంటనే చేతుల్లోకి తీసుకుని తాను కప్పుకున్న శాలువా కప్పాడు. కాగా, ఎవరో కని పడేసిన ఆ శిశువు రాత్రంతా శీతాకాల చలి వాతావరణాన్ని తట్టుకుని జీవించి ఉండటం చూసి సర్పంచ్ రాజ్‌కుమార్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అలాగే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు. సరైన దారి లేని ఆ పొలం వద్దకు వారు చేరుకున్నారు. పుట్టిన వెంటనే పడేయడంతో పాప శరీరంపై రక్తం ఉంది. అలాగే చలికి ఆ చిన్నారి శరీరం బిగుసుకుపోయింది. దీంతో వెంటనే పాపను వేడి నీటితో స్నానం చేయించారు. 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక నవజాత శిశువు కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
నవజాత శిశువును పుట్టిన వెంటనే పొలం వద్ద పడేసిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. తీవ్రమైన చలిని తట్టుకుని ఆ పాప బతకడం ఆశ్యర్యం కలిగిస్తున్నదని వెల్లడించారు.