Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక వివాహిత వ్యక్తి హోటల్ గదిలో ప్రియురాలిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల ప్రవీణ్ అలియాస్ సీతు, 39 ఏళ్ల ప్రియురాలు గీతతో కలిసి మంగళవారం నరేలా ప్రాంతంలోని హోటల్ గదిలో బస చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్ తన వద్ద ఉన్న పిస్టల్‌తో గీత ఛాతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తన తలపై కాల్చుకున్నాడు.
కాగా, తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న హాటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, గీతను ఆసుపత్రికి తరలించారు. అయితే గీత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన ప్రవీణ్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు నిందితుడు ప్రవీణ్ రెండు నెలల కిందట కూడా ఒకరిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 21న గౌరవ్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపినట్లు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో అరెస్టైన ప్రవీణ్, ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యాడని పోలీసులు తెలిపారు. అతడి భార్య, పిల్లలు గ్రామంలో ఉంటున్నట్లు వెల్లడించారు.