Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 200 కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటన కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. దిమాపూర్, బోకజాన్ ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాయి. అసోం-నాగాలాండ్ సరిహద్దులోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 200 కు పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని పలు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉధృతంగా తలెత్తాయి. మంటలకు పలు బైకులు, కార్లు ఆహుతయ్యాయి. ఇళ్లలోని నగదు, ఆహారవస్తువులు, దుస్తులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని అధికారులంటున్నారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నికీలలు సంభవించాయని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ జిల్లాలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగడం సర్వాసాధారణమైపోయాయి. ఈ ఏడాది జూన్ నెలలో జెంగ్ఖా బజార్ ప్రాంతంలో, అక్టోబర్ నెలలో గోలాఘాట్ ప్రాంతంలో కూడా భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.