Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 సుద్ధపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. డిచ్ పల్లి మండలం బర్దిపుర్ గ్రామానికి చెందిన గన్నారం స్వామి, మృతుడి బంధువు మోపాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వామీలు ద్విచక్ర వాహనంపై సుద్ధపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. పనులు ముగించుకొని జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేందుకు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఆర్మూర్ వైపు నుండి డిచ్ పల్లి వైపు వస్తున్న ఒక కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గన్నారం స్వామి 35 అక్కడికక్కడే మృతి చెందగా, మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. స్వామికి భార్య, కూతురు ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతితో ఉందని ఎస్సై కచ్చకాల గణేష్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు.