Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల్లోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నెలా రెండు రోజులు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నది.