Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీశాఖ సోదాలు ముగిశాయని తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు పూర్తయ్యాయని సమాచారం అందుతోంది. రెండు రోజులపాటు 65 బృందాలతో ఐటీశాఖ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించారు. 400 మంది ఐటీ అధికారులు దాదాపు 48 గంటల పాటు తనిఖీలు చేశారు. సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీన( సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.