Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆదిలాబాద్: అడవులు, కొండలు, గుట్టలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. భీంపూర్ మండలం కొండ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది. పొగమంచు కమ్ముకోవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పులి పంజా విసురుతున్నది. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటున్నది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. దీంతో చలిమంటలు, స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.