Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒడిశాలోని ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. కేంద్రపార జిల్లాలోని బాలియా బజార్లో ఈ ఘటన జరిగింది. నిమజ్జన కార్యక్రమంలో వివిధ పూజా వేదికల వద్ద బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ నిప్పురవ్వ బాణాసంచా నిల్వ ఉన్న సంచిలో పడింది. దీంతో తీవ్ర మంటలు చెలరేగాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో పాటు, వరుస పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొన్నది. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో జనం పరుగులు తిశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధితులందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు వారిని ఎస్బీఎమ్ మెడికల్ కాలేజీకి తరలించనున్నారు.