Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: దేశంలో గురువారం నుంచి పాలు, పెరుగు లీటరుపై రెండు రూపాయలు పెంచుతూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. నందిని బ్రాండ్ పాలు (లీటర్‌కు), పెరుగు (కిలోకు) 2 రూపాయలు పెంచుతున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. పెరిగిన పాలు, పెరుగు కొత్త ధరలు గురువారం నుంచే అమలులోకి వచ్చాయి. స్పెషల్ మిల్క్, శుభం, సమృద్ధి, సంతృప్తి, పెరుగుతో సహా తొమ్మిది రకాల పాల ధరలు పెంచినట్లు కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్ టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ.38, టోన్డ్ మిల్క్ రూ.39, హోమోజెనైజ్డ్ టోన్డ్ మిల్క్ రూ.40, హోమోజెనైజ్డ్ టోన్డ్ మిల్క్ రూ.44, స్పెషల్ మిల్క్ రూ.44, స్పెషల్ మిల్క్ రూ.45, శుభం రూ.45, సమృద్ధి రూ.50, సంతృప్తి రూ.52. నందిని పెరుగు రూ. రూ. 47లకు పెంచారు.