Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఐటీ అధికారులు తమను నమ్మించి మోసం చేశారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. తన ఇంట్లో సోదాలు పూర్తయిన తర్వాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. తన పెద్ద కొడుకుకు సంబంధించి కూడా రిపోర్ట్ తయారు చేశారని, ఆయనతో సంతకం చేయించుకోవడానికి వెళ్తుంటే... ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో ఉన్నారని, తన కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్పానని... దానికి ఐటీ అధికారులు అంగీకరించారని చెప్పారు. కానీ మోసం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ప నా కుమారుడి దగ్గరకు వెళ్లి సంతకం చేయించుకున్నారు అంత అవసరం ఏం వచ్చిందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నతో ఐటీ అధికారులు సంతకం చేయించుకుంటున్నారని ఆసుపత్రి నుంచి తన మనవరాలు తనకు ఫోన్ చేసి చెపితే తాను షాక్ కు గురయ్యానని అన్నారు. తన కొడుకు ఆ పేపర్లో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టేశాడని అన్నారు. ఇంత మోసం చేయాల్సిన అవసరం ఐటీ అధికారులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.