Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భోపాల్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. గురువారం ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహల్ మాట్లాడుతూ.. అడుగులు ఇప్పుడు బలంగా ఉంటాయని అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తాము గెలిచినప్పటికీ .. ఆపరేషన్ కమలం పేరిట బిజెపి 20-25 ఎమ్మెల్యేలను కోట్లకు కోట్లు చెల్లించి తమ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య మార్గాలన్నీ మూసుకుపోయాయని.. అందుకోసమే ఈ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. లోక్‌సభ, ఎన్నికల వ్యవస్థ, మీడియా అన్నీ మూతపడ్డాయని.. అన్ని సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వారితో నింపేశారని రాహుల్ మండిపడ్డారు.
న్యాయవ్యవస్థ కూడా ఒత్తిడికి లోనవుతోందని ధ్వజమెత్తారు. భారత్‌లో వ్యాప్తి చెందుతున్న హింస, విద్వేషం, భయాలను అడ్డుకోవడం ఈ యాత్ర మొదటి లక్ష్యమని అన్నారు. సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ యాత్ర మహారాష్ట్రలో పూర్తి చేసుకుని బుధవారం బీజేపీ పాలిత ప్రాంతం మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఖాండ్వాలోని బోర్గావ్ నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ గిరిజనుడైన తాంతియా భీల్ జన్మస్థలాన్ని రాహుల్ సందర్శించారు. రాహుల్ యాత్రకు కౌంటర్‌గా బీజేపీ కూడా బుధవారం పాదయాత్ర చేపట్టింది. జనజాతీయ గౌరవ్ యాత్ర పేరిట శివరాజ్‌సింగ్ చౌహాన్, నలుగురు మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం గమనార్హం. రాష్ట్రలో పూర్తి చేసుకుని బుధవారం బిజెపి పాలిత ప్రాంతం మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఖాండ్వాలోని బోర్గావ్ నుండి ఈయాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ గిరిజనుడైన తాంతియా భీల్ జన్మస్థలాన్ని సందర్శించారు. రాహుల్ యాత్రకు కౌంటర్‌గా బిజెపి కూడా బుధవారం పాదయాత్ర చేపట్టింది. జనజాతీయ గౌరవ్ యాత్ర పేరిట శివరాజ్‌సింగ్ చౌహాన్, నలుగురు మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం గమనార్హం.