Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మలేషియా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఆ దేశ ప్రధాని అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్రధానిగా ఇబ్రహీమ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని యాసిన్ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్వల్ప మెజారిటీ కూడా సాధించలేకపోయారు. చక్రవర్తి సుల్తాన్ సమక్షంలో మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మలేషియాకు అన్వర్ 10వ ప్రధాని కానున్నారు.