Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ లో సత్తాచాటుతున్న హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత -ఎ జట్టుకు తిలక్ ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భాగంగా భారత్-ఎ జట్టు బంగ్లాదేశ్-ఎ తో నాలుగు రోజుల పాటు జరిగే రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 29- డిసెంబర్ 2 మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. డిసెంబర్ 6-9 మధ్య రెండో మ్యాచ్ ను షెడ్యూల్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మకు అవకాశం లభించింది. అతనితో పాటు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అండర్-19 ప్రపంచ కప్ హీరో యశ్ ధూల్‌కు కూడా చోటు దక్కడం విశేషం.