Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. సీఈసీ నియామకానికి నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే అరుణ్ గోయల్‌ను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? జూనియర్ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారు? గత సీఈసీ పదవీ విరమణ వరకూ కూడా ఆగకుండా అరుణ్ గోయల్‌ను ఎలా ఎంపిక చేశారు? గోయల్ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నాం అని సుప్రీం కోర్టు తెలిపింది.