Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సినీ ఇండ్రస్టిలో పేరొందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ సంచలన ప్రకటన చేశారు. నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న తరుణంలో నరేష్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. దీనిపై నరేష్ స్పందిస్తూ రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్, రాజకీయాల్లోకి రానని, సున్నితంగా ఉండే నా లాంటి వాళ్ళకి రాజకీయాలు సరిపోవన్నారు హీరో అల్లరి నరేష్.