Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు పత్రాలను తీసుకొచ్చారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టు అధీనంలో ఉన్న ఈ తప్పుడు పత్రాలను చోరీ చేశారని, అసలే తప్పుడు పత్రాలు అవి కూడా చోరీకి గురయ్యాయని తెలిపారు. ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.