Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన సర్కార్ తాజాగా ఓ ప్రకటనలో గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేరుస్తూ నిరుద్యోగులకు తీపి కబురు అందజేసింది. గ్రూప్-3 లో మరో రెండు రకాల పోస్టులు యాడ్ చేసింది. గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు గ్రూప్-4 లో మరో 4 రకాల పోస్టులు చేర్చుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేరుస్తూ ప్రకటించింది.