Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరుతున్నామన్నారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని, నేనీ మాట ఎందుకు అంటున్నానంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వ్యతిరేకించే పార్టీల పైనా, వ్యాపార సంస్థలపైనా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాడులు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. అధికారుల వద్దే కెమెరాలు ఉంటాయి కాబట్టి సోదాలు లైవ్ లో చూపించాలి. అక్కడే ఏం జరిగిందో లైవ్ లోనే ప్రకటించవచ్చు. లైవ్ లో చూపించకపోతే మాత్రం అది కక్ష సాధింపు చర్యల కిందే భావించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు.